Loading...
Meta-Congress: కంటెంట్ ఆంక్షలపై నిరసనలు.. కాంగ్రెస్‌తో మెటా ఉన్నతాధికారుల భేటీ!
కంటెంట్ ఆంక్షలపై నిరసనలు.. కాంగ్రెస్‌తో మెటా ఉన్నతాధికారుల భేటీ!

Meta-Congress: కంటెంట్ ఆంక్షలపై నిరసనలు.. కాంగ్రెస్‌తో మెటా ఉన్నతాధికారుల భేటీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో కంటెంట్ నియంత్రణ విధానాలపై (Content Moderation) వెల్లువెత్తుతున్న నిరసనలను తగ్గించుకునేందుకు మెటా సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఈ టెక్ సంస్థకు చెందిన భారత్‌లోని ఉన్నతాధికారులు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలతో రహస్యంగా సమావేశమయ్యారు. మంగళవారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులు వెల్లడించారు.

వివరాలు 

మెటా తీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు..  

ఈ సమావేశంలో మెటా తరఫున భారత్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అమన్ జైన్, నటాషా జోగ్ పాల్గొన్నారు.

మెటా కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న నిరసనలు, సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను కించపరిచేలా రూపొందించిన పోస్టర్లపై వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ నేతలు, తమ పార్టీ నాయకుల సోషల్ మీడియా ఖాతాలు, పోస్టులపై ఆంక్షలు పెరుగుతున్నాయని మెటా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అధికార బీజేపీకి మెటా అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలపైనా ప్రశ్నించినట్లు ముగ్గురు వ్యక్తులు తెలిపారు.

అయితే, ఏ రాజకీయ పార్టీకి తాము అనుకూలంగా వ్యవహరించడం లేదని మెటా ఇప్పటికే స్పష్టం చేసింది.

వివరాలు 

నిరసనలతో మెటాపై ఒత్తిడి..

గత శుక్రవారం నుంచి కాంగ్రెస్ యువజన విభాగం నిరసనలు ప్రారంభించిన తర్వాత ఆ పార్టీతో మెటా నేరుగా సమావేశం కావడం ఇదే తొలిసారి.

ప్రభుత్వ ఆదేశాలతో తొలగించిన సోషల్ మీడియా ఖాతాలను పునరుద్ధరించాలని,తమ పోస్టులపై మెటా అల్గారిథమ్‌లు ఏ విధంగా ఆంక్షలు విధిస్తున్నాయో వివరించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

ఈ క్రమంలో హైదరాబాద్,ముంబై,గురుగ్రామ్‌లలోని మెటా కార్యాలయాల సమీపంలో ఆందోళనలు జరిగాయి.

కొన్ని చోట్ల నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.

ఈ వ్యవహారంపై స్పందించాలని కాంగ్రెస్ పార్టీని కోరగా వెంటనే ఎలాంటి సమాధానం రాలేదు.

భారత్‌లో అమల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగానే కంటెంట్‌ను నియంత్రిస్తున్నామని మెటా తెలిపింది. అయితే అమన్ జైన్, నటాషా జోగ్ మాత్రం ఈ సమావేశంపై స్పందించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

భారత్‌లో మెటాపై పెరిగిన ఆంక్షల వివాదం.. భారీగా కంటెంట్ తొలగింపులు!

కాంగ్రెస్‌తో జరిగిన భేటీలో మెటా ఎలాంటి హామీలు ఇవ్వలేదని సమావేశం గురించి తెలిసిన వ్యక్తి వెల్లడించారు.

స్థానిక చట్టాలకు కట్టుబడి పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వివరించినట్లు తెలిపారు.

అన్ని రాజకీయపార్టీల విషయంలోనూ తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగదారులు ఉన్న మార్కెట్‌గా భారత్‌లో మెటాకు ఈ వివాదం కొత్త రాజకీయ సవాలుగా మారింది.

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 మొదటి ఆరు నెలల్లో భారత చట్టాల ప్రకారం 54 లక్షలకు పైగా పోస్టులు లేదా ఖాతాలపై మెటా ఆంక్షలు విధించింది.

2025 మొత్తం ఏడాదిలో ఈ సంఖ్య సుమారు 70వేలుగా మాత్రమే ఉంది. దీంతో ఏడాదిలోనే కంటెంట్ తొలగింపులు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

జుకర్‌బర్గ్ పోస్టర్లతో కొత్త వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు

భారత్‌లో సవరించిన ఐటీ నిబంధనల వల్లే ఈ సంఖ్య పెరిగిందని మెటా చెబుతోంది.

ఈ నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైన కంటెంట్‌ను వేగంగా గుర్తించి, మరింత చురుగ్గా తొలగించాల్సి ఉంటుందని వివరిస్తోంది.

అయితే ఆన్‌లైన్‌లోని సమాచారాన్ని తొలగించాలంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలు పెరుగుతున్న నేపథ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చ మొదలైంది.

మరోవైపు జుకర్‌బర్గ్‌ను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన పోస్టర్లు ఈ వివాదాన్ని మరింత పెంచాయి.

వివరాలు 

జుకర్‌బర్గ్ పోస్టర్లతో కొత్త వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు

తెల్ల చొక్కా, ఖాకీ నిక్కరు, నల్ల టోపీ ధరించినట్లుగా జుకర్‌బర్గ్ చిత్రాలతో కూడిన బ్యానర్లు ఢిల్లీ, కోల్‌కతా, పాట్నా, ముంబై, బెంగళూరు నగరాల్లో కనిపించాయి.

ఈ దుస్తులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంప్రదాయ దుస్తులను పోలి ఉన్నాయి.

ఆర్‌ఎస్‌ఎస్ హిందూ జాతీయవాద భావజాలంతో పనిచేసే స్వచ్ఛంద సంస్థ. బీజేపీకి ఇది సైద్ధాంతిక మూలంగా పరిగణిస్తారు.

ఈ నిరసనలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు.

''ప్రైవేటు కంపెనీల కార్యాలయాలను ధ్వంసం చేయడమే కాంగ్రెస్ మోడల్'' అంటూ విమర్శించారు.

ADVERTISEMENT