మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం
బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులోని హెచ్‌బీఆర్ లేఅవుట్ వద్ద నిర్మాణలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. హోరమాపు ప్రాంతానికి చెందిన లోహిత్ కుమార్.. తన భార్య, ఇద్దరు కవల పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఇనుప చువ్వలతో కూడిన మెట్రో పిల్లర్ వారిపై కూలింది. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. లోహిత్ భార్య, మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. లోహిత్ కుమార్‌తో పాటు మరో కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
భారీగా ట్రాఫిక్ జామ్
ఇనుప చువ్వలతో కూడిన మెట్రో పిల్లర్ రోడ్డుపై కూలడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రోడ్డుపై పడి ఉన్న ఇనుప చువ్వలను తొలగించారు. ఈ ఘటనతో స్థానికులు, ప్రయాణికులు ఆందోళనకు దిగారు. నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రమాదం నేపథ్యంలో బీఎంఆర్సీఎల్ కాంట్రాక్టర్‌కు నోటీసును అందజేసే అవకాశం ఉంది.