Page Loader
జమ్ముకశ్మీర్‌: పుల్వామాలో యూపీకి చెందిన ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు
జమ్ముకశ్మీర్‌: పుల్వామాలో యూపీకి చెందిన ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు

జమ్ముకశ్మీర్‌: పుల్వామాలో యూపీకి చెందిన ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2023
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన వలస కార్మికుడు గాయాలతో మరణించాడని అధికారులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని రాజ్‌పోరా ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 12:45 గంటల యుపికి చెందిన ముఖేష్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. కశ్మీర్ జోన్ పోలీసులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మరణాన్ని ధృవీకరించారు.దర్యాప్తు కొనసాగుతున్నందున ఆ ప్రాంతాన్ని పోలీసు బలగాలతో మోహరించారు. గడిచిన 24 గంటల్లో కాశ్మీర్ లోయలో ఇది రెండో ఉగ్రదాడి. శ్రీనగర్‌లోని ఈద్గా మైదానంలో స్థానికులతో క్రికెట్ ఆడుతున్న మస్రూర్ అహ్మద్ వానీ అనే పోలీసు అధికారిపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం అయన చికిత్స పొందుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 పుల్వామాలో యూపీకి చెందిన వలస కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు