J&K: జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి భూమి స్వల్పంగా కంపించింది. రాత్రి 11.56 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కిష్త్వార్ జిల్లాలో 33.292 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.892 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. కేంద్రపాలిత ప్రాంతంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదని వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.1గా తీవ్రత నమోదు
A 3.1-magnitude earthquake jolts Kishtwar district at 10:56 PM on Monday, at a depth of 5 km, according to the National Centre for Seismology. No loss of life or property damage has been reported.@NCS_Earthquake pic.twitter.com/RV3U7EoZY0
— JK24x7 News (@JK247News) November 3, 2026