తదుపరి వార్తా కథనం
MEA: వెనెజువెలా సంక్షోభంపై విదేశాంగ శాఖ స్పందన.. భారతీయులకు కీలక సూచనలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 04, 2026
03:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు వెనెజువెలాపై యూఎస్ మిలిటరీ చేపట్టిన సైనిక చర్యలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. వెనెజువెలాలో నెలకొన్న పరిస్థితులను భారత్ అత్యంత నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించింది. అక్కడ నివసిస్తున్న భారతీయులతో కారకాస్‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ, అవసరమైన సహాయాన్ని అందిస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో వెనెజువెలాలో ఉన్న భారత పౌరులు కారకాస్‌లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులో ఉండాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ సూచించారు. వెనెజువెలా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.