LOADING...
కేసీయార్ పుట్టినరోజు వేడుకల్లో  అపశృతి బెలూన్లు పేలి కాలేరు వెంకటేష్ కు గాయాలు
పుట్టినరోజు వేడుకల్లో బెలూన్లు పేలి కాలేరు వెంకటేష్ కు గాయాలు

కేసీయార్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి బెలూన్లు పేలి కాలేరు వెంకటేష్ కు గాయాలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 17, 2023
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంబర్ పేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం కేసీయార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఆ వేడుకలో బెలూన్లు పేలి అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాచిగూడ కార్పరేటర్ ఏర్పాటు చేసిన ఈ వేడుకలో కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ, గ్యాస్ బెలూన్లు వదలడంతో నిప్పురవ్వలు ఆ బెలూన్లపై పడి అవి పేలి మంటలు చెలరేగడంతో అక్కడ ఎమ్మెల్యే సహ పలువురు కార్యకర్తలు భయంతో బయటకు పరుగుతీశారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురికి గాయాలయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు