LOADING...
Macron- Modi : ముంబయిలో మెక్రాన్‌-మోదీ ద్వైపాక్షిక సమావేశం
ముంబయిలో మెక్రాన్‌-మోదీ ద్వైపాక్షిక సమావేశం

Macron- Modi : ముంబయిలో మెక్రాన్‌-మోదీ ద్వైపాక్షిక సమావేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మంగళవారం ముంబయిలోని లోక్‌భవన్‌లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మెక్రాన్‌కు హృదయపూర్వక స్వాగతం పలికారు. సమావేశానికి ముందు మాక్రాన్ తన సతీమణి బ్రిగిట్టి మాక్రాన్ తో కలిసి తాజ్‌ హోటల్‌ వద్ద 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించారు.

వివరాలు 

19న'ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌'లో పాల్గొనున్న మెక్రాన్

మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి మెక్రాన్‌ ముంబయికి చేరుకున్నారు. ఈ పర్యటనలో రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందం, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ద్వైపాక్షిక సహకారం ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఈ నెల 19న ఢిల్లీలో నిర్వహించనున్న 'ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌'లో మెక్రాన్‌ పాల్గొననున్నారు. ఇదే సమయంలో భారత్‌కు 114 రఫేల్‌ యుద్ధవిమానాల సరఫరాపై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.3.25 లక్షల కోట్లు. ఇది ఖరారైతే, భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ రంగ ఒప్పందంగా నిలవనుంది.

Advertisement