Page Loader
Narendra Modi: కచ్‌లో సైనికులతో మోదీ.. సరిహద్దుల్లో ప్రత్యేక దీపావళి వేడుకలు
కచ్‌లో సైనికులతో మోదీ.. సరిహద్దుల్లో ప్రత్యేక దీపావళి వేడుకలు

Narendra Modi: కచ్‌లో సైనికులతో మోదీ.. సరిహద్దుల్లో ప్రత్యేక దీపావళి వేడుకలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2024
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జవాన్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్లతో దీపావళి పండుగను జరుపుకున్నారు. మోదీ సైనిక దుస్తుల్లో ప్రత్యక్షమై, సిబ్బందికి స్వీట్లు అందించి, వారితో పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. 2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి మోదీ ప్రతి దీపావళిని సరిహద్దుల్లోని సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు.

Details

సైనికులతో కలిసి దీపావళి వేడుకలు

ఆయన దీపావళి రోజున దళాలతో ముచ్చటిస్తూ, వారికి స్వీట్లు అందించారు. వారిలో స్ఫూర్తిని నింపడం వంటి కార్యకలాపాలతో వారి మధ్య ఆనందం పంచుకుంటున్నారు. 2014లో సియాచిన్‌లో దీపావళి వేడుకల్లో మొదటిసారి పాల్గొన్న మోదీ, 2022లో కార్గిల్‌లో, 2023లో హిమాచల్‌ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరంలో జవాన్లతో దీపావళి జరుపుకున్నారు.