
School toilet cleaning with dalit student: దళిత విద్యార్థితో స్కూల్ బాత్రూం క్లీనింగ్.. అపై క్లాస్ రూమ్‌లో లాక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ స్కూల్ టీచర్లు దళిత విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దళిత బాలుడితో స్కూల్ టాయిలెట్ శుభ్రం చేయడంతో పాటు ఆ విద్యార్థిని క్లాస్ రూమ్‌లో ఉంచి లాక్ వేశారు. తాజాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మంగళవారం లక్నోలోని జనసత్ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల దళిత విద్యార్థిని తరగతి గదిలో ఉంచి లాక్ చేశారు.
స్కూల్ ముగిసినా కుమారుడు ఇంటికి రాకపోవడతో తల్లి ఆందోళన చెందింది.
స్కూల్ వెళ్లి చూడగా క్లాస్‌రూమ్ నుంచి కుమారుడి ఏడ్పులు విని షాక్ అయింది.
Details
ప్రిన్సిపాల్ సంధ్యా జైన్ సస్పెండ్
ఈ ఘటనపై దళిత విద్యార్థి కుటుంబ సభ్యులు స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో క్లాస్ టీచర్ భర్త తాళాలు తీసుకొని స్కూల్‌కు తలుపులు తీశారు.
దళిత పిల్లలను ద్వేషించే ఇద్దరు ఉపాధ్యాయులు టాయిలెట్ శుభ్రంచేయమని తన కుమారుడ్ని బలవంతం చేశారని బాలుడి తల్లి ఆరోపించింది.
విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై స్పందించారు.
ప్రిన్సిపాల్ సంధ్యా జైన్‌ను సస్పెండ్ చేసి, క్లాస్ టీచర్ రవితా రాణికి వార్నింగ్ ఇచ్చారు.