Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన
త్వరలోనే తన లోక్‌సభ సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన సోమవారం మరో సంచలన ప్రకటన చేశారు. తన కుమార్తె శ్వేత కూడా టీడీపీ రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే కార్పొరేటర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. నాని కుమార్తె శ్వేత ప్రస్తుతం విజయవాడలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఉన్నారు. తండ్రి నిర్ణయంతో శ్వేత సోమవారం 10:30 గంటలకు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే, కేశినాని నాని ఫిబ్రవరిలో దిల్లీకి వెళ్లి తన ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.