Loading...
MPTC ZPTC election results: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు.. భారీ మెజార్టీలతో గెలిచిన అభ్యర్థులు వీరే!
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు.. భారీ మెజార్టీలతో గెలిచిన అభ్యర్థులు వీరే!

MPTC ZPTC election results: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు.. భారీ మెజార్టీలతో గెలిచిన అభ్యర్థులు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 07, 2026
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

పరిషత్‌ ఎన్నికల పోరులో పలువురు అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యర్థులకు అందనంత ఆధిక్యంతో గెలుపొందుతూ తమ సత్తా చాటారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు జనసేన జడ్పీటీసీ అభ్యర్థి పమిడిపాటి శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. క్రోసూరు మండలంలో మొత్తం 38 వేల ఓట్లు పోలవ్వగా.. పమిడిపాటి శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 30,273 ఓట్ల భారీ మెజార్టీని సాధించారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదే ఎన్నికల్లో మరికొందరు అభ్యర్థులు కూడా భారీ మెజార్టీలతో విజయం సాధించారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాలు

మాచవరం

పల్నాడు జిల్లా మాచవరం మండలంలో కూటమి బలపరిచిన తెదేపా అభ్యర్థి కత్తి సరోజిని 22,882 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి దొండేటి వెంకాయమ్మపై ఆమె భారీ ఆధిక్యాన్ని కనబరిచారు.

మైలవరం

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి పుత్త బ్రహ్మం 21,407 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

వేంపల్లి

కడప జిల్లా వేంపల్లిలో వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి బత్తల వెంకట శివమ్మ 19,203 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

గిద్దలూరు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి చేరెడ్డి శ్రీలక్ష్మి 12,616 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు.

ADVERTISEMENT