Mumbai BKC employees : అనంత్ అంబానీ వివాహ వేడుకలు..బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం సందర్భంగా ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని పలు కార్యాలయాలు, జులై 15 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయాలని ఉద్యోగులను ఆదేశించాయి. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు పరిమిత అనుమతుల కారణంగా ఈ నిర్ణయం తీసున్నారు. అనంత్ అంబానీ — రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు , వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ జూలై 12న BKCలోని Jio వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం చేసుకోనున్నారు, ఉత్సవాలు జూలై 14 వరకు కొనసాగుతాయి.
అనంత్-రాధికల వివాహ వేడుకల ఏర్పాట్లు
విపరీతమైన హంగూ ఆర్భాటాలతో జరిగే ఈ వేడుకలు ముంబైలోని స్థానిక నివాసితులు , కార్యాలయ ఉద్యోగుల రాకపోలకు ఇబ్బంది ,అసౌకర్యం కలిగించాయి. ముంబైలోని సందడిగా ఉన్న ఆర్థిక జిల్లా అయిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న వివాహ వేదిక చుట్టూ జూలై 12 నుండి 15 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతంలో భారతదేశం ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్, మార్కెట్ రెగ్యులేటర్ ,అనేక అంతర్జాతీయ బ్యాంకులు ఉన్నాయి. అంబానీ-మర్చంట్ వివాహం ముంబై అంతటా హోటల్ బుకింగ్‌లు ధరలు బాగా పెరిగాయి. BKCలోని లగ్జరీ హోటల్‌లు ఒక రాత్రికి 1 లక్ష వరకు వసూలు చేస్తున్నాయని కధనాలు వచ్చాయి.
వివాహానికి ముందే మొదలైన సందడి
ట్రైడెంట్ ఒబెరాయ్ వంటి హోటళ్లు ,వేదికలు జూలై 10 నుండి 14 వరకు పూర్తిగా బుక్ చేశారు. ఈ విలాసవంతమైన ఈవెంట్ బాలీవుడ్, హాలీవుడ్, వ్యాపార ,క్రీడా సర్కిల్‌ల నుండి ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. వివాహానికి దారితీసే అంతకుముందు ఈవెంట్‌లలో అంబానీ కుటుంబం నిర్వహించే సంప్రదాయ గుజరాతీ వివాహానికి ముందు 'మామేరు' వేడుక జూలై 3న జరిగింది. 'బేబీ', 'పీచెస్' 'లవ్ యువర్ సెల్ఫ్' వంటి హిట్‌లతో అతిథులను అలరించిన అంతర్జాతీయ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ప్రదర్శనతో జూలై 7న జరిగిన అద్భుతమైన సంగీత వేడుకతో వేడుకలు మరింత జరిగాయి.