LOADING...
Mumbai: ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. స్తంభించిన రహదారులు,రైలు మార్గాలు
ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. స్తంభించిన రహదారులు,రైలు మార్గాలు

Mumbai: ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. స్తంభించిన రహదారులు,రైలు మార్గాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

వరుసగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ముంబై నగరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మూడు వైపులా సముద్రం చుట్టుముట్టిన ఈ మహానగరం, భూభాగంతో ఉన్న నాలుగో వైపు రవాణా సంబంధాలు దెబ్బతినడంతో ద్వీపాన్ని తలపించే పరిస్థితి నెలకొంది. ముంబయి-పుణె, ముంబయి-అహ్మదాబాద్, ముంబయి-కొంకణ్‌ ప్రధాన రహదారులపై రాకపోకలు నిలిచిపోగా, రైల్వే సేవలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై తరచూ ఏర్పడే ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు 'మిస్సింగ్‌ లింక్‌' పేరుతో 13.3 కిలోమీటర్ల పొడవైన బైపాస్‌ను రూ.6,695 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టులో 1.6 కిలోమీటర్లు, 8.9 కిలోమీటర్ల పొడవున్న రెండు సొరంగాలు, అలాగే 183 మీటర్ల పొడవైన తీగల వంతెనను ఏర్పాటు చేశారు.

వివరాలు 

పలు రాష్ట్రాల్లోనూ విస్తారంగా భారీ వర్షాలు

ఈ మార్గం ద్వారా ప్రయాణ దూరం కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే తగ్గుతున్నప్పటికీ, ప్రయాణ సమయం 20 నుంచి 30 నిమిషాల వరకు ఆదా అవుతోంది. ఈ సొరంగ మార్గాన్ని తొమ్మిది వారాల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ప్రారంభించారు. అయితే సోమవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో సొరంగం సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది. అధికారులు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగించి మార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా, నైరుతి రుతుపవనాల ప్రభావంతో సోమవారం దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ విస్తారంగా భారీ వర్షాలు కురిశాయి.

Advertisement