Guwahati: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. హోటల్‌లో వ్యక్తి హత్య.. ప్రేమికుల అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
Guwahati: అసోం రాష్ట్రం గుహవాటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ సంచలనంగా మారింది.
ఓ 5 స్టార్ హోటల్ (5-Star Hotel) లో ఓ వ్యక్తి హత్య కేసును కొద్ది గంటల్లోనే పోలీసులు ఛేదించారు.
నిందితులను కోల్‌కతా (Kolkata) పారిపోతున్న క్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
గుహవాటి (Guwahati) విమానాశ్రయం సమీపంలోని అజారా హోటల్‌లో సోమవారం మధ్యాహ్నం సందీప్ సురేష్ కాంబ్లీ (42) శవమై కనిపించాడు.
హత్య ఈ విషయం తెలిసిన కొద్ది గంటల్లోనే పోలీసులు అంజలి షా (25), ఆమె ప్రియుడు రాకేష్ షా (27)అనే నిందితులను పట్టుకున్నారు.
హత్య
ఇద్దరితో అంజలి ప్రేమాయణం
కోల్‌కతా విమానాశ్రయంలోని ఒక రెస్టారెంట్‌లో పనిచేసిన అంజలి గత సంవత్సరం పూణేకి చెందిన కార్ డీలర్ కాంబ్లీతో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అంజలి అప్పటికే రాకేష్ అనే యువకుడితో రిలేషన్‌షిప్‌లో ఉంది.
రాకేష్‌కి కథ మొత్తం తెలిసి తనను పెళ్లి చేసుకోవాలని అంజలిపై ఒత్తిడి తెచ్చాడు.
అయితే కాంబ్లీ వద్ద అంజలితో సన్నహితంగా ఉన్న ఫొటోలు ఉన్నాయి. అవి బయటకు రాకుండా ఉండేందుకు అతన్ని హత్య చేసేందుకు అంజలి, రాకేష్ కుట్ర పన్నారు.
హత్య
అజారా హోటల్‌లో హత్య
గుహవాటిలో అంజలిని కలవాలని కాంబ్లీ ప్లాన్ చేసుకున్నాడు. ఇందుకోసం అజారా హోటల్‌లో గదిని బుక్ చేసుకున్నాడు.
ప్లాన్ ప్రకారం రాకేష్‌తో కలసి కోల్‌కతా నుంచి ఫ్లైట్ ఎక్కి అంజలి గుహవాటికి చేరుకుంది.
అజారాలోనే కాంబ్లీ దగ్గర గదిని రాకేష్ బుక్ చేశాడు. అంజలి, కాంబ్లి గదికి చెక్-ఇన్ చేసినప్పుడు, రాకేష్ కూడా వచ్చారు.
ఈ సమయంలో, గదిలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఇందులో కాంబ్లీ తీవ్రంగా గాయపడ్డాడు.
కాంబ్లీ గాయపడగానే అతని రెండు ఫోన్లను తీసుకొని రాకేష్, అంజలి పారిపోయారు.
గదిలో ముక్కు నుంచి రక్తం కారుతున్న కాంబ్లీని చూసిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఆధారంగా అంజలి, రాకేష్‌లను గుర్తించారు.