Page Loader
Gachibowli-Murder: గచ్చిబౌలిలో హోటల్​ యజమాని దారుణహత్య

Gachibowli-Murder: గచ్చిబౌలిలో హోటల్​ యజమాని దారుణహత్య

వ్రాసిన వారు Stalin
May 04, 2024
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

నగరంలోని గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. గచ్చిబౌలి అంజయ్య ప్రాంతంలో హోటల్​ నడుపుతున్న శ్రీనివాస్​ అనే వ్యక్తిని దారుణంగా ఓ దుండగుడు దారుణంగా హత్య చేశాడు. హోటల్​ రిసెప్షన్​ దగ్గర కుర్చీలో కూర్చున్న శ్రీనివాస్​ పై బయటనుంచి గునపంతో వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో హోటల్​ యజమాని శ్రీనివాస్​ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని అక్కడే హోటల్​ లో ఉన్న కొంతమంది వ్యక్తులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే శ్రీనివాస్​ మృతదేహాన్ని పోస్ట్​ మార్టమ్​ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య వెనుక పాత కక్షలేమైనా ఉన్నాయా? లేక క్షణికావేశంలో జరిగిందా అనే కోణంపై దర్యాప్తుచేస్తున్నారు.

Embed

హోటల్​ యజమాని శ్రీనివాస్​పై దాడి చేస్తున్న దుండగుడు వీడియో దృశ్యాలు

గచ్చిబౌలిలో దారుణ హత్య.. లైవ్ వీడియో గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హోటల్ యజమాని శ్రీనివాస్ (54) తలపై ఇనుప రాడ్‌తో దుండగుడు ఒక్కసారిగా దాడి చేయడంతో మృతిచెందాడు. pic.twitter.com/kz2TEZtEk2— Telugu Scribe (@TeluguScribe) May 3, 2024