
#Nara Lokesh: నవంబర్ 24 నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న మలివిడత యువగళం పాదయాత్రకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది.
నవంబర్ 24నుంచి లోకేశ్ యువగళం పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌తో కోనసీమ జిల్లా పొదలాడ వద్ద పాదయాత్ర నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఆగిపోయిన చోటు నుంచే మళ్లీ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
లోకేశ్ తన 208వ రోజుల పాదయాత్రలో 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు.
ఈ క్రమంలో పాదయాత్ర ముగింపు ప్రదేశాన్ని కూడా ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం.
వాస్తవానికి ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగించాలని ముందుగా అనుకున్నారు.
అయితే గతంలో చంద్రబాబు తన పాదయాత్రను వైజాగ్‌లో ముగించిన నేపథ్యంలో.. సెంటిమెంట్‌గా లోకేశ్ కూడా విశాఖలోనే తన పాదయాత్రకు ముగింపు పలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పొదలాడ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం
యువ గళం నిలిచిపోయిన చోట నుంచే తిరిగి 24 నుంచి ప్రారంభం
— JPR యువగళం (@JPRJayaPalReddY) November 20, 2023
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం🔥#YuvaGalam #YuvaGalamPadayatra pic.twitter.com/7zKoBbiNzt