Page Loader
నెల్లుట్ల సర్పంచ్‌కు జాతీయస్థాయి పురస్కారం; రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగం 
నెల్లుట్ల సర్పంచ్‌కు జాతీయస్థాయి పురస్కారం; రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగం

నెల్లుట్ల సర్పంచ్‌కు జాతీయస్థాయి పురస్కారం; రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగం 

వ్రాసిన వారు Stalin
Apr 21, 2023
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారానికి జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని నెల్లుట్ల సర్పంచ్‌ స్వరూపారాణి ఎంపికైన విషయం తెలిసిందే. నీటి సమృద్ధిలోమంచి ప్రతిభ కనబర్చిన గ్రామాలకు జాతీయ స్థాయిలో ఇచ్చే ఈ అవార్డును గురువారం సర్పంచ్ చిట్ల స్వరూపారాణి అందుకున్నారు. అంతేకాకుండా ఆమెకు రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగించే అరుదైన గౌరవం కూడా దక్కింది. రాష్ట్రపతి భవన్‌లో ఆమె చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆమె వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఎలా సమకూరాయో చెప్పారు. నెల్లుట్ల గ్రామాభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను చిట్ల స్వరూపారాణి రాష్ట్రపతి భవన్‌లో వివరించారు.

సర్పంచ్

ఆ మూడు సూత్రాలే మా గ్రామ ప్రగతికి మంత్రాలు: స్వరూపారాణి

మూడు సూత్రాలే తమ గ్రామ ప్రగతికి మంత్రాలని చెప్పారు. నీటి వృథాను తగ్గించడం, వాటిని తిరిగి వినియోగించడం, రీఛార్జ్ చేయడం అనే మూడు సూత్రాల ఆధారంగా తాము పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తున్నట్లు స్వరూపారాణి వెల్లడించారు. అంతేకాకుండా 17ఎకరాల విస్తీర్ణంలో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలను నాటుతున్నట్లు చెప్పారు. వాన నీటి సంక్షరణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, ఫాంపాండ్లు కట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరిగినట్లు ఆమె తన ప్రసంగంలో వెల్లడించారు. ఇలా అనేక కార్యక్రమాలను అమలు చేయడం వల్లే జాతీయ స్థాయిలో మొదటి ప్లేస్‌లో నిలిచినట్లు పేర్కొన్నారు.