దేశంలోనే పాపులర్ సీఎంల జాబితాలో రెండోస్థానంలో 'యోగి'.. నంబర్ వన్ ఎవరో తెలుసా?
Most popular chief minister: దేశంలోని సీఎంల పాపులారిటీపై ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక సర్వే నిర్వహించగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితాలో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా 5వ స్థానంలో నిలిచారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 52.7 శాతం రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 51.3 శాతం పాపులారిటీ రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు. 48.6 శాతం రేటింగ్‌తో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మూడో స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 42.6 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
సాహాపై ప్రశంసలు
త్రిపుర ప్రజలు సర్వేలో ముఖ్యమంత్రి సాహాపై ప్రశంసలు కురిపించారు. నిజాయితీ, ఆయన హయాంలో చేసిన పనిని అక్కడి ప్రజలు మెచ్చుకున్నారు. సాహా కరుణామయ నాయకుడని త్రిపుర ప్రజలు కొనియాడారు. వ్యాపారవేత్త అయిన ముఖ్యమంత్రి సాహా.. చాలా నిజాయితీపరుడని, ఎల్లప్పుడూ అట్టడుగు స్థాయిలో పనిచేస్తారని ప్రజలు పొగడ్తలతో ముంచెత్తారు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడానికి అతను ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. మార్చి 2023లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని మాణిక్ సాహా త్రిపురలో అధికారంలోకి తెచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీని విజయపథంలో నడిపించిన మాణిక్ సాహా స్వతహాగా డెంటల్ సర్జన్. 2016లో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అతను 2020లో రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నియమించబడ్డాడు.