LOADING...
పిరియాడిక్‌ టేబుల్‌ తొలగింపుపై రగడ.. స్పందించిన NCERT
ఎన్సీఆర్టీపై విమర్శల పర్వం

పిరియాడిక్‌ టేబుల్‌ తొలగింపుపై రగడ.. స్పందించిన NCERT

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 02, 2023
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెన్త్ క్లాస్ లో సైన్స్‌ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌ ను తొలగించడంపై ఎన్సీఆర్టీపై విమర్శల పర్వం మొదలైంది. హుటాహుటిన స్పందించిన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఆయా మాటల దాడులకు బదులిచ్చింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్ నుంచి దీన్ని మొత్తానికే తీసేయలేదని వెల్లడించింది. 11, 12వ తరగతుల్లో ఈ సిలబస్ అంతా ఉంటుందని సమర్థించుకుంది. సిలబస్‌ హేతుబద్ధీకరణలో భాగంగా టెన్త్ క్లాస్ లో మరిన్ని సబ్జెక్టులను తొలగించినట్లు కౌన్సిల్ వివరించింది. సైన్స్ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌, ఇంధన మూలకాలు, సహజ వనరుల నిర్వహణ, డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌ - 1 నుంచి ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు వంటి పాఠాలను తొలగించింది.

Details

కొవిడ్ కారణంగానే హేతుబద్ధీకరించాం : ఎన్సీఆర్టీ

ఇండియాలో సైన్స్ ను కంపల్సరీ సబ్జెక్టుగా బోర్డ్ ఎగ్జామ్ అయిన టెన్త్ క్లాస్ వరకు మాత్రమే బోధిస్తారు. అనంతరం సైన్స్ గ్రూప్‌ చదివే స్టూడెంట్స్ కు మాత్రమే తొలగించిన సబ్జెక్టులను చదివే అవకాశం ఉంటుంది. ఫలితంగా కీలకమైన పిరియాడిక్‌ టేబుల్‌ పాఠ్యాంశాన్ని పదో తరగతి సైన్స్ బుక్ నుంచి తీసేయడంపై ప్రోఫెషనల్స్ , సైంటిస్టులు ఖండించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని దగ్గర దగ్గర 1800 మందికిపైగా మేధావులు, నిపుణులు కౌన్సిల్ కు బహిరంగ లేఖ రాయగా, అది కాస్తా చినికి చినికి గాలివానలా తయారైంది. ఈ క్రమంలోనే విమర్శలపై కౌన్సిల్ స్పందిస్తూ కొవిడ్ కాలంలో స్టూడెంట్స్ విలువైన సమయాన్ని కోల్పోయారని, అందుకే వారిపై భారం పడకూడదనే సిలబస్‌ను హేతుబద్ధీకరించామని వివరణ ఇచ్చుకుంది.