Page Loader
విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్ 
విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్

విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్ 

వ్రాసిన వారు Stalin
May 24, 2023
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023లో మొదటి త్రైమాసికానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 9.95లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న విద్యా దీవెన కింద రూ.703 కోట్లను బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సావిత్రి బాయి ఫూలే వంటి సంఘ సంస్కర్తల ఆశయ సాధన కోసం, చదవుకు పేదరికం అడ్డుకావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 14,912.43 కోట్లను పంపిణీ చేసినట్లు జగన్ అన్నారు. త్వరలో ఏపీ నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కేంద్రంగా మారుతుందన్నారు.

ఏపీ

జగనన్న నాకు అండగా నిలబడ్డారు: సీఎం జగన్

జగనన్న విద్యా దీవెన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్‌పై దివ్య అనే విద్యార్థిని ప్రశంసల వర్షం కురిపించింది. తాను సంతోషంగా ఉండటానికి కారణం సీఎం జగన్ అని చెప్పింది. తన తండ్రికి పక్షవాతం వచ్చిందని, తల్లి మూగ- చెవిటి అని, ఈ క్రమంలో తనకు జగనన్న అండగా నిలబడ్డారని దివ్య పేర్కొంది. చదువులో తనకు ఇబ్బంది లేకుండా ఉండటానికి విద్యా దీవెన‌తో పాటు వసతి దీవెనను కూడా జగనన్న అందిస్తున్నారని ఈ సందర్భంగా దివ్య చెప్పింది. జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ విద్యాసంస్థల రూపు రేఖలను మొత్తం మార్చేశారని ఆమె వెల్లడించింది. దివ్య స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్, ఆమెను పిలిచి ఆశీర్వదించారు.