
Rajasthan Kota: కోటాలో 20 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య.. 28కి పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 28కి చేరుకుంది.
విద్యార్థిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫౌరీద్ హుస్సేన్‌గా గుర్తించారు. నగరంలోని వక్ఫ్ నగర్ ప్రాంతంలోని తన అద్దె గదిలో నీట్ విద్యార్థి హుస్సేన్ ఉరివేసుకుని కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వివరాలలోకి వెళితే.. హుస్సేన్ మరికొందరు విద్యార్థులతో కలిసి ఆ వసతిగృహంలో ఉంటున్నాడు.
దాదాపు సాయంత్రం 4 గంటలకు హుస్సేన్‌ను చివరిసారిగా చూశామని, ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు అతని గది లోపలి నుండి తాళం వేసి ఉందని విద్యార్థులు తెలిపారు.
Details
ఆందోళనకరంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
వారి కాల్‌లకు హుస్సేన్ స్పందించకపోవడంతో అతని స్నేహితులు ఇంటి ఓనర్ సహాయం కోరారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు.
విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు.
కోటాలో గత కొన్ని నెలలుగా విద్యార్థుల ఆత్మహత్యల కేసులు ఆందోళనకరంగా పెరుగుతూనే ఉన్నాయి.
ఇది స్థానిక అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. అధికారులు ఇప్పుడు అన్ని కోచింగ్ సెంటర్‌లలో సీలింగ్ ఫ్యాన్‌లలో యాంటీ-హాంగింగ్ పరికరాలను అమర్చడాన్ని తప్పనిసరి చేశారు.
రెండు నెలల పాటు ఎటువంటి పరీక్షలు నిర్వహించకూడదని ఇన్‌స్టిట్యూట్‌లకు ఆదేశాలు కూడా జారీ చేశారు.