NEET UG 2026 Results: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలు లక్ష్యంగా పెట్టుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం రాత్రి ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచగా, అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, జన్మతేదీ వంటి వివరాలను నమోదు చేసి స్కోరుకార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జరిగిన రీ-పరీక్షకు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 11.21 లక్షల మంది వైద్య ప్రవేశాలకు అర్హత సాధించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. దేశంలోని 66 నగరాలకు చెందిన 138 మంది విద్యార్థులు అత్యున్నత ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
వివరాలు
17 మంది టాపర్లు
మొత్తం 720 మార్కులకు గాను 705కు పైగా మార్కులు సాధించిన 17 మంది టాపర్లుగా నిలిచారు.
వీరిలో తెలంగాణ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు.
అలాగే 700కు పైగా మార్కులు 19 మంది విద్యార్థులు సాధించారు.
వారిలో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హరియాణాకు చెందిన పన్షుల్ బన్సల్ చెరో 715 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.
ఇక 650కు పైగా మార్కులు 1,492 మంది, 600కు పైగా మార్కులు 10,160 మంది, 500కు పైగా మార్కులు 90,780 మంది విద్యార్థులు సాధించినట్లు ఎన్‌టీఏ తెలిపింది.
వివరాలు
కేటగిరీల వారీగా అర్హత సాధించిన వారి వివరాలు
కేటగిరీల వారీగా అర్హత సాధించిన వారి వివరాలను పరిశీలిస్తే.. జనరల్ విభాగంలో 2.91 లక్షల మంది, ఓబీసీ (ఎన్‌సీఎల్)లో 5.12 లక్షల మంది, ఎస్సీ విభాగంలో 1.59 లక్షల మంది, ఎస్టీ విభాగంలో 63,716 మంది, జనరల్ ఈడబ్ల్యూఎస్‌లో 95,026 మంది, పీడబ్ల్యూబీడీ కేటగిరీలో 3,666 మంది, పీడబ్ల్యూడీ విభాగంలో 303 మంది అర్హత సాధించారు.
వివరాలు
3న నిర్వహించిన నీట్ (యూజీ) పరీక్ష ప్రశ్నపత్రం లీక్
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం తొలుత మే 3న నిర్వహించిన నీట్ (యూజీ) పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంతో వివాదాస్పదమైంది.
దీంతో జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్‌ను నిర్వహించారు. ఈ పరీక్షకు కూడా సుమారు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.
రీ-పరీక్ష అనంతరం జులై 13న ఓఎంఆర్ షీట్లను విడుదల చేసిన ఎన్‌టీఏ, జులై 15 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించింది.
అనంతరం తుది ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఫలితాలను ప్రకటించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.