Loading...
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్

Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు మరో శుభవార్త. మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైలును వారానికి మూడు రోజుల పాటు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని ఈ ఎక్స్‌ప్రెస్ రైలు కవర్ చేయనుంది. వారానికి మూడు రోజులు.. మచిలీపట్నం నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శనివారం ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ నుంచి ప్రతి మంగళవారం,గురువారం, ఆదివారం రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సర్వీసు ప్రారంభంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ ప్రాంతాల మధ్య రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

వివరాలు 

ఈ స్టేషన్లలో ఆగుతుంది..

కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ రైల్వే స్టేషన్లలో ఆగనుంది.

ఈ మార్గంలోని ప్రయాణికులకు కొత్త రైలు సర్వీసు అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

ADVERTISEMENT