Telangana: ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఆరంభం.. రోడ్లపై కొత్త స్టిక్కర్లతో పోలీస్ వాహనాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 23, 2026
08:50 am
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్,సైబరాబాద్ కమిషనరేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే రాచకొండ కమిషనరేట్‌కు ప్రభుత్వం కొత్తగా మల్కాజిగిరి కమిషనరేట్‌గా పేరు మార్చింది. అదేవిధంగా ఫ్యూచర్‌సిటీ పేరిట కొత్త పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త కమిషనరేట్ పేరుతో పోలీసు వాహనాలపై స్టిక్కర్లు అంటించే ప్రక్రియ పూర్తి కావడంతో, ప్రస్తుతం అవి రహదారులపై కనిపిస్తున్నాయి. మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మోకిల, శంషాబాద్ పోలీస్ స్టేషన్లకు చెందిన వాహనాలపై ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ స్టిక్కర్ల అమరిక ఇప్పటికే ముగిసింది.