LOADING...
AP DSC Hall Tickets: జూలై 1, 2 డీఎస్సీ పరీక్షలకు కొత్త హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
జూలై 1, 2 డీఎస్సీ పరీక్షలకు కొత్త హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

AP DSC Hall Tickets: జూలై 1, 2 డీఎస్సీ పరీక్షలకు కొత్త హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు తాజా అప్డేట్ వచ్చింది. జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. గతంలో జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన ఈ పరీక్షలు, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా వాయిదా వేసిన ఈ పరీక్షలను జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు [apdsc.apcfss.in] (http://apdsc.apcfss.in) వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ, మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి సూచించారు.

Details

పరీక్షకు మొత్తం 18,231 మంది హాజరు

హాల్‌టికెట్‌లో పేర్కొన్న పరీక్షా కేంద్రాన్ని నిర్ధారించుకుని పరీక్షలకు హాజరుకావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించి, హాల్‌టికెట్లను ముందే డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు సిద్ధం కావాలని విద్యాశాఖ పేర్కొంది. ఇక ఆదివారం జరిగిన స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) పరీక్షకు మొత్తం 18,231 మంది హాజరయ్యారు. కాగా సుమారు 1500 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.