Loading...
Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

అర్నబ్ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా తేరుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌-నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఇది వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం కదలికలను డాప్లర్‌ వెదర్‌ రాడార్‌ సాయంతో వాతావరణశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం

ADVERTISEMENT