TG Govt Scheme : తెలంగాణ మహిళలకు కొత్త అవకాశాలు.. త్వరలోనే కొత్త పథకం అమలు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కొత్త పథకం తీసుకొస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 'ఇందిరా మహిళా శక్తి పథకం' పేరుతో మహిళల కోసం కొత్త పథకాన్ని రూపొందించామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఒక కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు.
ఈ పథకంలో భాగంగా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయడం, మహిళలకు ప్రోత్సాహం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్ధేశమన్నారు.
Details
మహిళలకు ఆర్థిక సాయం
రాజస్థాన్‌లో ప్రారంభించిన 'ఇందిరా మహిళా శక్తి ఉద్యామ్ ప్రోత్సాహన్ యోజన' వంటి విధంగా, తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాన్ని చేపట్టేందుకు కృషి చేయనున్నారు.
ఈ పథకం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థికసాయం, మద్దతును అందించాలనుకుంటున్నారు.
ఈ క్రమంలో, మహిళలకు వ్యక్తిగత రుణం కింద గరిష్టంగా రూ. 5 లక్షలు, స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది.
ఈ విధంగా తెలంగాణలో మహిళల నేతృత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సహాయపడనుంది.