LOADING...
Kavitha:తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. కవిత పార్టీ లాంచ్ డేట్ ఫిక్స్
తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. కవిత పార్టీ లాంచ్ డేట్ ఫిక్స్

Kavitha:తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. కవిత పార్టీ లాంచ్ డేట్ ఫిక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

కల్వకుంట్ల కవిత కీలక రాజకీయ ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. అదే రోజున పార్టీ పేరు, జెండాను కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. శ్రీరామనవమి శుభదినం కావడంతో ఈ ప్రకటనను ఇవాళ వెల్లడిస్తున్నట్లు కవిత తెలిపారు. యువత, మహిళలకు తమ పార్టీలో ప్రత్యేక స్థానం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటివరకు పురుషులు స్థాపించిన పార్టీలను చూసిన ప్రజలు, ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డగా తాను పార్టీ స్థాపిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement