Page Loader
డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం..  గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు
గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు

డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు

వ్రాసిన వారు Stalin
Dec 21, 2022
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ నుంచి భారత్‌కు డ్రోన్ల ద్వారా దిగుమతి అవుతున్న డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫోకస్ పెట్టింది. పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోని డ్రగ్స్ సరఫరాకు సంబంధమున్నట్లు అనుమానిస్తున్న గ్యాంగ్ స్టర్ల ఇళ్లు, వారికి సంబంధించిన ప్రాంగణాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సన్నిహితులను టార్గెట్ చేశారు అధికారులు. పాక్ నుంచి భారత్‌కు డ్రగ్స్ సరఫరా చేసే డ్రోన్లను గతంలో అనేకసార్లు సరిహద్దు దళాలు గుర్తించాయి. ఈ డ్రోన్లను పాక్ నుంచి డ్రగ్స్ మాఫియా ఆపరేట్ చేస్తుంది. అయితే భారత్‌లో ఈ డ్రగ్స్‌ను ఎవరు దిగుమతి చేసుకుంటున్నారనే దానిపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది.

ఎన్ఐఏ

ఇప్పటికే కొంతమంది గుర్తింపు..

పంజాబ్, రాజస్థాన్, హర్యానాలో పలువరు గ్యాంగ్‌స్టర్లను అనుమానిస్తున్న ఎన్ఐఏ.. బుధవారం ఉదయం నుంచి దాడులు చేస్తోంది. డ్రగ్స్ సరఫరాపై ఇప్పటికే ఇప్పటికే యూఏపీఏ కేసు కూడా నమోదు చేసింది. గ్యాంగ్‌స్టర్ల ప్రాంగణాల్లో గత నెలలో కూడా ఎన్ఐఏ దాడులు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన డ్రగ్ డీలర్లు.. భారతదేశానికి చెందిన గ్యాంగ్‌స్టర్‌లకు డ్రగ్స్ పంపుతున్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు తెలుస్తోంది. వారిలో ఇప్పటికే కొంతమందిని గుర్తించినట్లు సమాచారం. గోల్డీ బ్రార్ తో పాటు అతని అనుచరులు గుర్తించినవారిలో తెలుస్తోంది. మరికొంత మంది గోల్డీ బ్రార్ అనుచరులపై అనుమానంతో వారి స్థలాలపై అధికారులు దాడులు చేస్తున్నారు.