Hyderabad: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఎన్‌ఎండీసీ మారథాన్.. విదేశాల నుంచి తరలివచ్చిన రన్నర్స్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 30, 2026
09:28 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోనే అతిపెద్ద ఎన్‌ఎండీసీ మారథాన్ రన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ మారథాన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా రన్నర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే విభాగాల్లో పరుగులు నిర్వహించారు. వేలాది మంది రన్నర్స్‌తో మారథాన్ సందడిగా సాగింది. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన రన్.. హుస్సేన్ సాగర్ లేక్, లోక్‌భవన్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు కొనసాగింది. హాఫ్ మారథాన్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రారంభించారు. భారీ సంఖ్యలో రన్నర్స్ పాల్గొనడంతో మారథాన్ నిర్వహణ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.