Loading...
Jantar Mantar protests:  జంతర్‌మంతర్‌ హింసపై ఫిర్యాదులేవీ రాలేదు.. సుప్రీంకోర్టుకు విచారణ కమిటీ నివేదిక
సుప్రీంకోర్టుకు విచారణ కమిటీ నివేదిక

Jantar Mantar protests:  జంతర్‌మంతర్‌ హింసపై ఫిర్యాదులేవీ రాలేదు.. సుప్రీంకోర్టుకు విచారణ కమిటీ నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని జంతర్‌మంతర్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు దాదాపు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని సుప్రీంకోర్టు నియమించిన హైపవర్డ్‌ విచారణ కమిటీ వెల్లడించింది. బాధితుల నుంచి తగిన ఫిర్యాదులు, ఆధారాలు అందకపోవడంతో ఘటనలపై ఇప్పటికీ ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నామని కమిటీ తెలిపింది. ఈ విషయాన్ని గురువారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనానికి తెలియజేసింది. జులై 20న సీజేపీ నేతృత్వంలో నిర్వహించిన 'చలో పార్లమెంట్‌' మార్చ్‌ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు 149 వార్తాపత్రికల్లో నోటీసులు ప్రచురించినట్లు కమిటీ తెలిపింది.

వివరాలు 

అక్టోబర్‌ 21న మరోసారి ఫిర్యాదుల ఆహ్వానం 

అయినప్పటికీ ఆన్‌లైన్‌లో, నేరుగా దాదాపు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని పేర్కొంది.

అక్టోబర్‌ 21న మరోసారి ఫిర్యాదులను ఆహ్వానించినట్లు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో జంతర్‌మంతర్‌ హింసకు సంబంధించిన పిటిషన్లు, వీడియోలు, ఫిర్యాదులను హైపవర్డ్‌ విచారణ కమిటీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నిర్ణీత వ్యవధిలో మధ్యంతర నివేదికలు సమర్పించాలని కమిటీకి సూచించింది.

వివరాలు 

ఆగస్టు 18న హైపవర్డ్‌ విచారణ కమిటీ ఏర్పాటు 

నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో నిర్వహించిన నిరసనల సందర్భంగా పోలీసులు నిరసనకారులపై పెల్లెట్‌ గన్‌లు ప్రయోగించారని, ముందస్తు హెచ్చరికలు లేకుండానే బాష్పవాయువు వదిలారని ఆరోపణలు వచ్చాయి.

పోలీసుల చర్యలు దౌర్జన్యపూరితంగా, హింసాత్మకంగా ఉన్నాయని నిరసనకారులు ఆరోపించారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 18న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైపవర్డ్‌ విచారణ కమిటీ ఏర్పాటైంది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోంది.

బాధితులు సాధారణ పౌరులైనా, పోలీసు సిబ్బంది అయినా తమ ఫిర్యాదులను సమర్పించేందుకు అవకాశం కల్పించింది.

ADVERTISEMENT