
GVMC: జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి
ఈ వార్తాకథనం ఏంటి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది.
శనివారం ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పైన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షత వహించారు. మొత్తం 74 మంది కూటమి కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరైయ్యారు.
అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో, హాజరైన 74 మంది సభ్యులందరూ ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.
ఫలితంగా, మేయర్‌గా ఉన్న గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది.
ఈ విజయంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం అధికారంగా చేపట్టింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జనసేన పార్టీ చేసిన ట్వీట్
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై ఈ రోజు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ అవిశ్వాస తీర్మానం ప్రక్రియకు హాజరైన జనసేన పార్టీ కార్పొరేటర్లు.
— JanaSena Party (@JanaSenaParty) April 19, 2025
జనసేన విశాఖ నగరం అధ్యక్షుడు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే శ్రీ @ChVamsiYadav, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ @KonathalaForAKP,… pic.twitter.com/tFG35mkLl9