lockdown rumours: లాక్‌డౌన్ వదంతులకు చెక్.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో మళ్లీ కోవిడ్ తరహా లాక్‌డౌన్ విధిస్తారన్న వదంతులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా ఇంధనం కొనుగోలు చేస్తూ ప్రజలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లాక్‌డౌన్‌పై స్పష్టత ఇచ్చిన హర్దీప్ పూరి పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ(Hardeep Singh Puri) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఎలాంటి దశలోనూ లేదని స్పష్టం చేశారు. "లాక్‌డౌన్ వదంతులు పూర్తిగా అసత్యం. కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో మనం శాంతంగా, బాధ్యతగా, ఐక్యంగా ఉండాలి" అని ఆయన Xలో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హర్‌దీప్ సింగ్ పూరీ చేసిన ట్వీట్
Union Minister Hardeep Singh Puri tweets, "...The Government has taken a huge hit on it taxation revenues to ensure very high losses of oil companies (approximately 24 Rs/litre for petrol and 30 Rs/litre for diesel) at this time of sky high international prices are reduced. At… pic.twitter.com/T1SDia1kJ2
— ANI (@ANI) March 27, 2026
వివరాలు
పెట్రోల్ బంకుల వద్ద భయాందోళన కొనుగోళ్లు
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి( Strait of Hormuz) మార్గం మూసివేయడంతో ఇంధన సరఫరాపై సందేహాలు తలెత్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున ఇంధనం కొనుగోలు చేయడం ప్రారంభించారు. LPG సిలిండర్ల సరఫరాలో కూడా కొంత కొరత కనిపించినట్లు సమాచారం.
వివరాలు
ఇంధన సరఫరాపై కేంద్రం భరోసా
అయితే దేశంలో ఇంధన సరఫరా పూర్తిగా సురక్షితంగానే ఉందని పూరి తెలిపారు. ప్రజలకు అవసరమైన ఇంధనం, శక్తి సరఫరా ఎక్కడా అంతరాయం లేకుండా అందించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రధానమంత్రినరేంద్ర మోదీ(Narendra Modi) నాయకత్వంలో అన్ని అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పూరి తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లో కూడా భారత్ గతంలో నిలకడగా వ్యవహరించిందని, ఇకముందు కూడా అదే విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు.
వివరాలు
పార్లమెంట్‌లో మోదీ హామీ
ఇటీవల పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ Lok Sabha, Rajya Sabhaల్లో మాట్లాడారు. దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని మార్గాల ద్వారా గ్యాస్, ముడి చమురు సేకరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. చమురు నిల్వలు బలోపేతం దేశంలో ఇంధన భద్రత కోసం గత 11 ఏళ్లలో 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను ఏర్పాటు చేసినట్లు మోదీ వెల్లడించారు. భవిష్యత్తులో మరింతగా 65 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక నిల్వలను సృష్టించే ప్రణాళిక కూడా ఉందని చెప్పారు.