Loading...
Hardeep Puri: గ్యాస్ సిలిండర్ల కొరత లేదు.. పుకార్లు నమ్మొద్దు: కేంద్ర మంత్రి పూరి
గ్యాస్ సిలిండర్ల కొరత లేదు.. పుకార్లు నమ్మొద్దు: కేంద్ర మంత్రి పూరి

Hardeep Puri: గ్యాస్ సిలిండర్ల కొరత లేదు.. పుకార్లు నమ్మొద్దు: కేంద్ర మంత్రి పూరి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎల్పీజీ, వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. కొరత ఉన్నట్లు సోషల్ మీడియాలో, ఇతర మార్గాల్లో వస్తున్న పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని ఓ వార్తా సంస్థకు తెలిపారు.

వివరాలు 

హోర్ముజ్ అంశం ప్రభావం ఉన్నా..

హోర్ముజ్ అంశం వల్ల కొంత ప్రభావం పడిన విషయం వాస్తవమేనని పూరి పేర్కొన్నారు.

అయితే దేశంలో వంటగ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని చెప్పారు.

ముఖ్యంగా గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ ఉత్పత్తిని పెంచినట్లు వివరించారు.

గతంలో దేశీయంగా రోజుకు సుమారు 34 వేల టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి జరిగేదని, ప్రస్తుతం అది 55 వేల నుంచి 56 వేల టన్నులకు పెంచినట్లు మంత్రి తెలిపారు.

అందువల్ల ఎక్కడా ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేశారు. పుకార్లను నమ్మి గ్యాస్ సిలిండర్ల కోసం డీలర్ల వద్ద పొడవైన క్యూల్లో నిలబడవద్దని ప్రజలకు సూచించారు.

వివరాలు 

డిజిటల్ బుకింగ్‌నే ఉపయోగించండి..

వంటగ్యాస్ కోసం వినియోగదారులు డిజిటల్ బుకింగ్ విధానాన్ని ఉపయోగించాలని హర్దీప్ సింగ్ పూరి సూచించారు.

సిలిండర్ కోసం అనవసరంగా గ్యాస్ గోదాంలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

సంబంధిత యాప్ ద్వారా ఇంటి నుంచే సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని, బుక్ చేసిన తర్వాత 24 గంటల్లోనే ఇంటికి డెలివరీ చేసేలా వ్యవస్థ ఉందని తెలిపారు.

''గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు. అయితే కొరత ఉందంటూ వస్తున్న పుకార్లకు మాత్రం కొదువ లేదు'' అని పూరి వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

వివరాలు 

పుకార్లతో పెరిగిన పానిక్ బుకింగ్స్..

గ్యాస్ కొరతపై వచ్చిన వదంతుల కారణంగా ప్రజల్లో ఆందోళన పెరిగిందని మంత్రి తెలిపారు.

చాలామంది అవసరానికి మించి అదనపు సిలిండర్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు.

దీంతో కొన్ని నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. గురుగ్రాంలో తన కుటుంబ స్నేహితుడొకరు కూడా పుకార్లను నమ్మి అదనపు సిలిండర్లు బుక్ చేసుకున్నారని పూరి గుర్తుచేశారు.

ఆయన ఇంటికి ఇప్పటికే గ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్ ఉన్నప్పటికీ వదంతుల కారణంగా ఆందోళనకు గురయ్యారని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

రోజుకు 90 లక్షలకు చేరిన బుకింగ్స్..

సాధారణ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా రోజుకు సగటున 52 లక్షల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ జరుగుతాయని పూరి తెలిపారు.

అయితే గ్యాస్ కొరతపై పుకార్లు వ్యాపించిన సమయంలో కొన్ని రోజుల పాటు రోజువారీ బుకింగ్స్ సంఖ్య ఏకంగా 90 లక్షలకు పెరిగిందని చెప్పారు.

అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకునే ఈ పానిక్ బుకింగ్స్‌ను నియంత్రించేందుకు గ్యాస్ పంపిణీ వ్యవస్థను రేషనలైజ్ చేసినట్లు మంత్రి వివరించారు.

ప్రజలు వదంతులను నమ్మకుండా, అవసరానికి అనుగుణంగా డిజిటల్ విధానంలో ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవాలని సూచించారు.

ADVERTISEMENT