Noida's Jewar Airport: నోయిడా జెవర్ ఎయిర్‌పోర్ట్ పేరు మార్పు.. మోదీ పేరుకు కేబినెట్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలో నిర్మితమవుతున్న జెవర్ విమానాశ్రయం పేరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టే ప్రతిపాదనకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లక్నోలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జెవర్ విమానాశ్రయాన్ని ఇకపై 'నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్'గా పిలవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడం, వారసత్వ సంపదను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ మేరకు విమానాశ్రయం పేరు మార్పు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించిందని వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జెవర్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ పేరు
#BREAKING: Noida Airport has been named Narendra Modi International Airport pic.twitter.com/bqMge7qzES
— IANS (@ians_india) October 9, 2026