NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్ల, బ్యానర్లు ఏర్పాటు సరికాదు: కేరళ సీఎం విజయన్ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్ల, బ్యానర్లు ఏర్పాటు సరికాదు: కేరళ సీఎం విజయన్ 
    PM Modi: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్ల, బ్యానర్లు ఏర్పాటు సరికాదు: కేరళ సీఎం విజయన్

    PM Modi: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్ల, బ్యానర్లు ఏర్పాటు సరికాదు: కేరళ సీఎం విజయన్ 

    వ్రాసిన వారు Stalin
    Feb 12, 2024
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, అమలు చాలా చేయడం కష్టమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

    కేరళలో కేంద్ర ప్రభుత్వం అలాంటి ఆదేశాలు జారీ చేసిందా? అని ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఆయన ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఐయూఎంఎల్‌ ఎమ్మెల్యే పి.అబ్దుల్‌ హమీద్‌ అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్‌ అనిల్‌ సమాధానమిస్తూ.. 14,000పీఎం బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసేందుకు ఎఫ్‌సీఐ, కేరళ ఆహార శాఖకు కేంద్రం బాధ్యతలు అప్పగించిందని చెప్పారు.

    కేరళ వ్యాప్తంగా ఎంపిక చేసిన 550రేషన్ షాపుల్లో ప్రధాని సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది.

    కేరళ

    ఎన్నికల కోసం కేంద్రం సరికొత్త పబ్లిసిటీ: విజయన్

    ఆహార పదార్థాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వ లోగోలు ఉన్న క్యారీ బ్యాగ్‌లను ఉపయోగించాలని కూడా ఆర్డర్ ఉందని మంత్రి అనిల్ తెలిపారు.

    ఉత్తర్వులు అమలులో ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని ఎఫ్‌సీఐ అధికారులను కేంద్రం కోరినట్లు ఆయన తెలిపారు.

    రేషన్ పంపిణీ వ్యవస్థను ఎన్నికల ప్రచారానికి వినియోగించడం సరికాదని మంత్రి అనిల్ మండిపడ్డారు.

    కేరళలో చాలా కాలంగా రేషన్ వ్యవస్థ ఉందని సీఎం విజయన్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త పబ్లిసిటీ పద్ధతిని అమలు చేస్తోందన్నారు.

    ఇది, రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికల ప్రచారమని స్పష్టమవుతోందని ముఖ్యమంత్రి అన్నారు.

    రాష్ట్రంలో అమలు చేయడం కష్టమని తమ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేస్తుందని విజయన్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    పినరయి విజయన్
    తాజా వార్తలు

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    కేరళ

    కేరళలో నిఫా వైరస్ కలకలం.. ఏడు గ్రామాల్లో పాఠశాలలు, బ్యాంకులు మూసివేత  నిఫా వైరస్
    కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే  నిఫా వైరస్
    కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి.. గబ్బిలాలు, చెట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్న నిపుణులు  నిఫా వైరస్
    కేరళలో నిఫా విజృంభణ.. సెప్టెంబర్ 24 వరకు కోజికోడ్‌లో అన్ని విద్యాసంస్థలు బంద్ నిఫా వైరస్

    పినరయి విజయన్

    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కేరళలో మైకుపై కేసు నమోదు.. సీఎం ప్రసంగంలో మొరయించిందని పరికరం స్వాధీనం కేరళ
    యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం కేరళ

    తాజా వార్తలు

    MNS- BJP: మహారాష్ట్రలో కొత్త పొత్తులు.. బీజేపీ కూటమిలోకి రాజ్ థాకరే పార్టీ!  బీజేపీ
    Paytm: ఆర్‌బీఐ ఆంక్షలపై జోక్యం చేసుకోలేం: పేటీఎం‌కు కేంద్రం సూచన  పేటియం
    Ancient Vishnu idol: కర్ణాటకలోని కృష్ణా నదిలో వేల ఏళ్లనాటి విష్ణువు విగ్రహం లభ్యం కర్ణాటక
    Tamil Nadu: ఊటీలో కూలిన గోడ.. ఆరుగులు భవన నిర్మాణ కార్మికులు మృతి  తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025