
TSPSC గ్రూప్ 1, 2, 3 రాత పరీక్ష తేదీల విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 సర్వీసుల పోస్టుల కోసం రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి.
ఈమేరకు TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచింది.
గ్రూప్ II సర్వీసెస్ పరీక్ష ఆగష్టు 7, 8 తేదీల్లో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించనుంది. మొత్తం నాలుగు పేపర్లలో పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షల ద్వారా 783 పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేయనుంది.
గ్రూప్-I సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ జూన్ 9న జరగనుంది. మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21న నిర్వహించనుంది. మొత్తం 563 పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేస్తుంది.
గ్రూప్-III సర్వీసెస్ పరీక్ష నవంబర్ 17, 18 తేదీల్లో జరనుంది. ఈ పరీక్షలతో 1388 పోస్టులు భర్తీ కానున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జూన్ 9న గ్రూప్-I ప్రిలిమినరీ టెస్ట్
గ్రూప్ 1,2,3 పరీక్షల తేదీలు ఖరారు
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2024
జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్న టీఎస్‌పీఎస్‌సీ pic.twitter.com/3KCmCwGFNH