LOADING...
Popoulu Banana: పోషకాల్లో పుష్కలంగా ఉన్న 'పొప్పోలు అరటి'
పోషకాల్లో పుష్కలంగా ఉన్న 'పొప్పోలు అరటి'

Popoulu Banana: పోషకాల్లో పుష్కలంగా ఉన్న 'పొప్పోలు అరటి'

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

చూడడానికి చిన్నగా, గుండ్రంగా కనిపించే ఇవి అరటిపండ్లే. వీటిని 'పొప్పోలు అరటి'గా పిలుస్తారు. పొట్టిగా, వెడల్పుగా ఉండే ఈ అరటికాయల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్‌ B6, విటమిన్‌ C కూడా ఎక్కువగా లభిస్తాయి. ఈ ప్రత్యేక రకం అరటికాయలను కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రధానంగా చిప్స్‌ తయారీలో వినియోగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్‌. డెబోరా మెస్సియానా ఈ విషయాన్ని వెల్లడించారు. మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కిసాన్‌ మేళాలో ఈ అరటికాయలను ప్రదర్శించారు.

Advertisement