Loading...
Omar Abdullah': ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం.. ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధమన్న మత పెద్దలు
ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధమన్న మత పెద్దలు

Omar Abdullah': ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం.. ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధమన్న మత పెద్దలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకోవడం మతపరమైన వివాదానికి దారితీసింది. వీరి పెళ్లి ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధమని, మతపరంగా చెల్లదని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. షరియత్ నిబంధనల ప్రకారం నిఖా జరగాలంటే వధూవరులిద్దరూ ముస్లింలై ఉండాలని మౌలానా స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా ముస్లిం అయినప్పటికీ, నిధి రజ్దాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించలేదని పేర్కొన్నారు. ఈ కారణంగా వారి వివాహం ఇస్లామిక్ చట్టాల ప్రకారం చెల్లదని అభిప్రాయపడ్డారు. నిఖాకు ముందే నిధి రజ్దాన్ ఇస్లాం మతంలోకి మారి ఉంటేనే ఈ వివాహానికి మతపరమైన గుర్తింపు లభించేదని వివరించారు.

వివరాలు 

కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం

కాగా, ఒమర్ అబ్దుల్లా శనివారం సోషల్ మీడియా వేదికగా తన వివాహ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. "కొత్త ప్రయాణం మొదలైంది" అంటూ నిధి రజ్దాన్‌తో కలిసి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఢిల్లీలో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వీరి వివాహం జరిగినట్లు సమాచారం.

ఒమర్ అబ్దుల్లాకు ఇది రెండో వివాహం. ఆయన తన మొదటి భార్య పాయల్ నాథ్‌తో 2009 నుంచి విడిగా ఉంటున్నారు.

ఈ ఏడాది జులై 31న సుప్రీంకోర్టు వీరికి పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది.

ADVERTISEMENT