
కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించిన 3కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది.
అయితే, వ్యభిచారం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించాలని సిఫార్సు చేసిన హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన రెండు సూచనలతో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కార్యాలయం ఏకీభవించకపోవడం గమనార్హం.
భారతీయ జ్యుడీషియల్ కోడ్ బిల్లు, 2023వ్యభిచారం (సెక్షన్-497), స్వలింగ సంపర్కం(సెక్షన్-377) నేరంగా పరిగణించాలని, ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని కమిటీ సిఫార్సు చేసింది.
అయితే పీఎంఓ ఈ సిఫార్సులను ఆమోదించడానికి సున్నితంగా తిరస్కరించింది.
ఎందుకంటే ఇది చాలా విస్తృతమైన పరిణామాలను కలిగిస్తుంది. సుప్రీంకోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా కమిటీ సిఫార్సులు ఉండటంతో పీఎంఓ ఈ నిర్ణయం తీసుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను తిరస్కిరించిన పీఎంఓ
#DebBiz #Breaking #newcriminallaws #gaysex #adultery pic.twitter.com/I6jEjTbBn9
— Debasish Gharai (@DebasishGharai) December 11, 2023