తదుపరి వార్తా కథనం

ఒడిశా బీచ్‌లో అబ్బురపరిచే 'చంద్రయాన్-3' సైకత శిల్పం
వ్రాసిన వారు
Stalin
Aug 23, 2023
08:30 am
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రయాన్-3 మిషన్ బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవడానికి సిద్ధంగా ఉంది.
దేశం మొత్తం ఎంతో ఆసక్తితో ఈ మిషన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ బృందం అద్భుతమైన కళాకృతితో చంద్రయాన్ -3 మిషన్ శుభాకాంక్షలు తెలియజేసింది.
చంద్రయాన్-3 భారత జెండాతో చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ అయినట్లు పట్నాయక్ తన సైకత శిల్పం ద్వారా చూపించారు.
చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం కాగానే, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు మతాలకతీతంగా పూజల చేయడం ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం
ALL THE BEST 🇮🇳 #Chandrayan3
— Sudarsan Pattnaik (@sudarsansand) August 22, 2023
My students created a sand art on #Chandrayaan 3 with the message "Jai Ho @isro , at Puri beach in Odisha. pic.twitter.com/SDbL8kpbEt