Page Loader
చంద్రయాన్-3పై స్పందించిన సునీత విలియమ్స్.. చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
చంద్రయాన్-3పై స్పందించిన సునీత విలియమ్స్

చంద్రయాన్-3పై స్పందించిన సునీత విలియమ్స్.. చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు వెల్లడి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 22, 2023
07:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రయాన్‌-3 మిషన్‌ కీలక ఘట్టానికి చేరుకున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు జాబిల్లిపై బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్ అడుగుపెట్టనుంది. ఈ అద్వితీయమైన దృశ్యం కోసం భారత ప్రజలతో పాటు ప్రపంచ దేశాలూ ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్‌-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం తాను ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తెలిపారు. ఈ మేరకు అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌ అభివృద్ధిని, పురోగతిని ప్రశంసించారు. చంద్రయాన్‌- 3 ప్రయోగాన్ని ఓ గొప్ప అడుగుగా ఆమె అభివర్ణించారు.చంద్రుడిపై పరిశోధనలు విజ్ఞానానికే పరిమితం కాదని, భూమికి బయట స్థిర నివాస అవకాశాల కోసం అన్వేషిస్తుందన్నారు.

embed

చందమామపై పరిశోధనల్లో భారత్ ముందంజలో ఉండటం ఆనందకరం : సునీత విలియమ్స్

చంద్రుడిపై చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ పాదం మోపడం మనకెంతో గర్వకారణమని, అది అమూల్యమైన సమాచారాన్ని సైతం అందిస్తుందని సునీత విలియమ్స్ అన్నారు. అంతరిక్ష, ఖగోళ పరిశోధనలు, జాబిల్లిపై స్థిర నివాసానికి అన్వేషణల అంశాల్లో భారత్‌ ముందంజలో ఉందని చెప్పారు. ఇందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. నిజంగా ఇవి ఉత్తేజం, ఉద్విజ్ఞంతో కూడుకున్న క్షణాలన్నారు. చంద్రుడిపై ల్యాండర్‌, రోవర్‌ అందించే ఫలితాలపై ఎంతో ఉత్సుకతతో ఉన్నానని చెప్పుకొచ్చారు. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన రెండో మహిళగా సునీతా విలియమ్స్‌ చరిత్ర సృష్టించడం గమనార్హం.