LOADING...
PM Modi: ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం 
ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం

PM Modi: ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ పండగ అన్నదాతలది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "మంగళకరమైన సంక్రాంతి శుభవేళ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సూర్యుడి గమనంలో వచ్చే మార్పు కొత్త వెలుగులు తీసుకొస్తుందో, అలాగే ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను చేరుకునే శక్తిని ఇస్తుందనే ఆశిస్తున్నాను. ఈ పండగ దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో, భిన్న సంప్రదాయాలతో జరుపుకుంటున్నా, అందులోని ఆత్మీయత, ఆనందం మాత్రం మనందరినీ కలిపి ఉంచేలా ఉంటుంది. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని, ఏకత్వ స్ఫూర్తిని ఈ పండగలు ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా ఈ పండగ మన అన్నదాతలకు అంకితం. రైతు సోదరులకు కృతజ్ఞతలు తెలియజేసే పవిత్ర సమయం ఇది.

వివరాలు 

జాతి నిర్మాణంలో రైతుల పాత్ర

మకర సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త ఆత్మవిశ్వాసం నింపాలని, మీ భవిష్యత్తు ఎల్లప్పుడూ సానుకూలంగా, ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటున్నా" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో రైతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా దిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ.. "దేశ రైతులు జాతి నిర్మాణంలో బలమైన స్థానం కలిగి ఉన్నారు. వారి కృషి వల్ల ఆత్మనిర్భర్‌ భారత్ ఉద్యమానికి శక్తివంతమైన తోడ్పాటు లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతులను శక్తివంతంగా మారుస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతోంది. సంక్రాంతి మనకు చెబుతోంది, ప్రకృతిపట్ల కృతజ్ఞతా భావాన్ని మాటల్లో మాత్రమే కాకుండా, జీవనశైలిలోనూ చూపించాలి.

వివరాలు 

జాతి నిర్మాణంలో రైతుల పాత్ర

భవిష్యత్తు తరాల కోసం మట్టిని ఆరోగ్యంగా ఉంచాలి, నీటిని రక్షించాలి, వనరులను సమతౌల్యంగా వినియోగించాలి. 'అమ్మ' పేరుతో ఒక చెట్టు నాటడం, 'అమృత్ సరోవర్' వంటి కార్యక్రమాలు ఇదే భావనను ముందుకు తీసుకెళ్తున్నాయి. రాబోయే రోజుల్లో సుస్థిర, సహజ వ్యవసాయం, అగ్రిటెక్, వాల్యూ ఎడిషన్ రంగాలకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. ఈ రంగాల్లో యువత కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. మన పళ్లెం, జేబు నిండటమే కాకుండా, నేలతల్లి సురక్షితంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత" అని ప్రధాన మంత్రి తెలిపారు.

Advertisement

వివరాలు 

జాతి నిర్మాణంలో రైతుల పాత్ర

కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, కె.రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాసవర్మ, అర్జున్‌రామ్ మేఘ్‌వాల్, వి.సోమన్న, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అర్వింద్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఆర్‌.మహాదేవన్, NHRC ఛైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్, సినీనటులు శివకార్తికేయన్, మీనా తదితరులు పాల్గొన్నారు. సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాశ్ ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి గోమాతకు ఆహారం అందించారు. తమిళ సంప్రదాయ వంటకం పొంగల్ తయారీలో పాల్గొన్నారు.

Advertisement