LOADING...
Wayanad Landslide: వయనాడ్‌లో మరోసారి కొండచరియల బీభత్సం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
వయనాడ్‌లో మరోసారి కొండచరియల బీభత్సం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

Wayanad Landslide: వయనాడ్‌లో మరోసారి కొండచరియల బీభత్సం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని వయనాడ్ జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడి తీవ్ర కలకలం రేపాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అనక్కంపొయిల్‌-కల్లాడి సొరంగం నిర్మాణ ప్రాంతంలో భూస్ఖలనం సంభవించింది. మంగళవారం ఉదయం కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని కొంతమంది కార్మికులను సురక్షితంగా బయటకు తీశాయి. అయితే మరికొందరు ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నట్లు సమాచారం. చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించేందుకు సహాయక సిబ్బంది యుద్ధప్రాతిపదికన గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేరళలో భారీ వర్షాలు.. వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు

Advertisement