అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన
అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర తెలంగాణకు రానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 21,566 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. తొలుత అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్ పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా మోదీ రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 3వ తేదీన ప్రధాని మోదీ నిజామాబాద్‌కు రానున్నారు. నిజామాబాద్‌లో రూ.8,021 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
ఆదివారం ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..
ఆదివారం మధ్యహ్నం 1:30గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. తర్వాత హెలీకాప్టర్‌లో మహబూబ్‌నగర్ చేరుకుంటారు. అనంతరం 2:15 నుంచి 2:50గంటల మధ్య అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యహ్నం 3గంటలకు బహిరంగ సభాస్థలి వద్దకు మోదీ చేరకొని బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. ఈ సందర్భంగా ఆయన 45 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారీగా జనాన్ని సమీకరించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు.