తదుపరి వార్తా కథనం

Sri Ramanavami: భద్రాచలం శ్రీరాముని తలంబ్రాలు ఇంటికే.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 02, 2025
09:51 am
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికి నేరుగా పంపిణీ చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
ఇక భక్తులు ఈ నెల 6వ తేదీ వరకు కూడా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాలు, సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా భక్తులు రూ.151 చెల్లించి తలంబ్రాలను ఆర్డర్ చేయవచ్చని సూచించారు.
ఆన్‌లైన్ బుకింగ్‌తో పాటు, భక్తులు కాల్ సెంటర్ల నంబర్లు 040-69440069, 040-69440000 ను సంప్రదించి సేవలు పొందొచ్చని తెలిపారు. నగరంలోని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.