NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jamili Elections:లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
    తదుపరి వార్తా కథనం
    Jamili Elections:లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
    లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

    Jamili Elections:లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    12:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో "ఒకే దేశం-ఒకే ఎన్నిక" (One Nation One Election) సిద్దాంతాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదించిన బిల్లు ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.

    ఇందులో 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, మరొక బిల్ కేంద్రం మంగళవారం సభలో ప్రవేశపెట్టింది.

    ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రకటించారు.

    ఈ బిల్లుపై విశ్లేషణలకు సంబంధించి, పార్లమెంటు ఉభయసభల సంయుక్త కమిటీకి పంపించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు.

    ఈ కమిటీలో సభ్యుల సంఖ్య పార్టీల ఆధారంగా నిర్ణయించబడుతుంది. సభ్యుల పేర్లను ఇప్పటికీ రాజకీయ పార్టీలు స్పీకర్‌కు ప్రతిపాదించాలని కోరారు.

    కమిటీకి 90 రోజులు గడువు విధించనున్నారు,ఆ తరువాత ఈ గడువు పొడిగించవచ్చు.

    వివరాలు 

    జమిలి ఎన్నికలు ఎప్పుడు అన్న విషయం మీద పెద్ద చర్చ 

    జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చిన 32 రాజకీయ పార్టీలను మరియు 15 వ్యతిరేక పార్టీలను ఇప్పటికే రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది.

    జమిలి ఎన్నికలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకే సమయంలో నిర్వహించే ఉద్దేశంతో ఉంటుంది.

    ఈ విధానం దేశంలో కొత్తదేమీ కాదు; 1952 నుండి 1967 వరకు, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అయితే, పలు కారణాలతో తర్వాతి కాలంలో ఈ విధానం కొనసాగలేదు.

    ప్రస్తుతం, జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం మీద పెద్ద చర్చ జరుగుతుంది.

    కోవింద్ కమిటీ సిఫారసు ప్రకారం, లోక్‌సభ తొలి సమావేశం 2024లో జరగడంతో, జమిలి ఎన్నికలు 2029లో జరగవచ్చు.

    వివరాలు 

    జమిలి ఎన్నికలు 2034లో జరగవచ్చు 

    టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించారు.

    కొంతమంది, 2027 లేదా 2028లో కూడా ఈ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు, అయితే బిల్లు చట్టం రూపంలో మార్చిన తర్వాత ఈ ప్రక్రియ మరింత సులభమవుతుందని వారు అంచనా వేస్తున్నారు.

    దీని బట్టి, జమిలి ఎన్నికలు 2034లో జరగవచ్చని కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమిలి ఎన్నికలు

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    జమిలి ఎన్నికలు

    One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ  అసెంబ్లీ ఎన్నికలు
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్  రాహుల్ గాంధీ
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025