LOADING...
Vontimitta Brahmotsavams 2026 : ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

Vontimitta Brahmotsavams 2026 : ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అంగరంగ వైభవంగా సిద్ధమైంది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయంలో ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్టించబడటం విశేషం. ఈ ప్రత్యేకత కారణంగా ఒంటిమిట్టకు "ఏకశిలా నగరం" అనే పేరు వచ్చింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి అంకురార్పణతో శ్రీకారం చుడనున్నారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మూలవిరాట్టులకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చనలు శాస్త్రోక్తంగా జరుగుతాయి.

వివరాలు 

సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం

సాయంత్రం 6 గంటల నుంచి అర్చకులు వేదమంత్రాల నడుమ అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చుతారు. అనంతరం విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ వంటి ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి. తరువాత పుట్టమన్ను సేకరణ కార్యక్రమం నిర్వహిస్తారు.

వివరాలు 

మార్చి 27న ధ్వజారోహణం

మార్చి 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ పోతన జయంతి సందర్భంగా కవిసమ్మేళనం ఉంటుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనసేవలో స్వామివారు, అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Advertisement

వివరాలు 

వాహనసేవల వివరాలు :

28.03.2026: ఉదయం - వేణుగానాలంకారము, రాత్రి - హంస వాహనం 29.03.2026 : ఉదయం - వటపత్రశాయి అలంకారము, రాత్రి - సింహ వాహనం 30.03.2026: ఉదయం - నవనీత కృష్ణాలంకారము, రాత్రి - హనుమంత వాహనం 31.03.2026 : ఉదయం - మోహినీ అలంకారము, రాత్రి - గరుడసేవ 01-04-2026 : ఉదయం - శివధనుర్భాణ అలంకరణ, మద్యాహ్నం 03.15 గం.లకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం సాయంత్రం 06.30 గం.ల నుండి 08.30 గం.ల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం. రాత్రి గజవాహన సేవ నిర్వహిస్తారు.

Advertisement

వివరాలు 

వాహనసేవల వివరాలు :

02-04-2026 : ఉదయం - రథోత్సవం 03-04-2026 : ఉదయం - కాళీయమర్ధనాలంకారము, రాత్రి - అశ్వవాహనం 04-04-2026 : ఉదయం - చక్రస్నానం, రాత్రి - ధ్వజావరోహణం. ఏప్రిల్ 05వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం ఉంటుంది.

Advertisement