
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నీరా కేఫ్ ప్రారంభం; దీని విశేషాలు ఇవిగో
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో నిర్మించిన నీరా కేఫ్ అండ్ ఫుడ్ కోర్టును తెలంగాణ ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.
నెక్లెస్ రోడ్‌లో రూ. 12.2కోట్లతో దీన్ని నిర్మించారు. దేశంలోనే తొలి నీరా కేఫ్ ఇదే. తాటి చెట్ల నుంచి సేకరించిన కల్లుగా పిలువబడే నీరాను ఈ కేఫ్‌లో వినియోగదారులకు అందిస్తారు.
విశాలమైన సదుపాయాలతో 300 నుంచి 500 మందికి వసతి కల్పించే విధంగా ఈ కేఫ్‌లో ఏడు స్టాల్స్ ఉన్నాయి.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాలనే ఉద్దేశంతో గౌడ కులస్థలు సంక్షేమం కోసం ఈ ప్రత్యేకమైన కేఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
తెలంగాణలో కల్లు(నీరా)ను తాగడం సర్వసాధారణం. నీరాలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, ప్రొటీన్, షుగర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
తెలంగాణ
ఇది విజయవంతమైతే మరికొన్ని కేంద్రాల ఏర్పాటు
మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు వంటి వ్యాధుల నివారణలో నీరా పానీయం సహాయపడుతుంది.
ఈ కేఫ్ ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10గంటల వరకు తెరిచి ఉంటుంది.
నీరాతో పాటు, నీరా కేఫ్ బెల్లం, చక్కెర, తేనె వంటి ఇతర ఉప ఉత్పత్తులను కేఫ్‌లో విక్రయించనున్నారు. ఈ కేఫ్ నీరా వినియోగదారుల కోసం చికెన్, మటన్ వంటి రుచికరమైన వంటకాలను కూడా సరఫరా చేస్తుంది.
నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభించిన నీరా కేఫ్ విజయవంతమైతే, మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
నీరా, దాని ఉప ఉత్పత్తులను తయారు చేయడానికి, ప్యాక్ చేయడానికి, విక్రయించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇవ్వడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నీరా కేఫ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది
— V Srinivas Goud (@VSrinivasGoud) May 3, 2023
రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు నీరా ను, అనుబంధ ఉత్పత్తులైన తేనె, బూస్ట్, షుగర్, బెల్లం లను విడుదల… pic.twitter.com/R6cyv6Ugch