Loading...
University Rankings: ఉస్మానియా వర్సిటీ ర్యాంకు భారీగా పతనం.. 180 స్థానాలు దిగజారిన ఓయూ
ఉస్మానియా వర్సిటీ ర్యాంకు భారీగా పతనం.. 180 స్థానాలు దిగజారిన ఓయూ

University Rankings: ఉస్మానియా వర్సిటీ ర్యాంకు భారీగా పతనం.. 180 స్థానాలు దిగజారిన ఓయూ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

వివిధ సంస్థలు విడుదల చేస్తున్న యూనివర్సిటీ ర్యాంకింగ్‌లలో ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) స్థానం ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. క్యూఎస్‌ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్‌-2027లో ఓయూ ఏకంగా 180 స్థానాలు దిగజారి 650వ ర్యాంకుకు పరిమితమైంది. 2026 ర్యాంకింగ్‌లో 470వ స్థానంలో ఉన్న ఈ వర్సిటీ.. తాజా జాబితాలో వెనుకబడింది. మంగళవారం ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేశారు. మరోవైపు, ఐఐటీ హైదరాబాద్‌ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. గత ఏడాది 270వ స్థానంలో ఉన్న ఈ సంస్థ.. తాజా ర్యాంకింగ్‌లో 251వ స్థానానికి చేరింది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) మాత్రం 246వ స్థానం నుంచి 270వ స్థానానికి పడిపోయింది.

వివరాలు 

ఈ యూనివర్సిటీలకు క్యూఎస్‌ ఆసియా ర్యాంకింగ్‌లో చోటు

జేఎన్‌టీయూ హైదరాబాద్‌, ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలు తొలిసారిగా క్యూఎస్‌ ఆసియా ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి.

జేఎన్‌టీయూహెచ్‌ 1201-1300 మధ్య ర్యాంకు సాధించగా, ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకుంది.

ఓక్సన్‌ యూనివర్సిటీ 499వ ర్యాంకును సాధించింది. ఇక్ఫాయ్‌, ఉర్దూ విశ్వవిద్యాలయాలు 1101-1200 మధ్య ర్యాంకులు పొందగా, ఇఫ్లూ 1501+ విభాగంలో నిలిచింది.

వివరాలు 

ప్రపంచ ర్యాంకింగ్‌లోనూ ఓయూకు నిరాశ

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ స్థాయిలోనూ ర్యాంకులు తగ్గుతున్నాయి.

జూన్‌లో విడుదలైన క్యూఎస్‌ ప్రపంచ ర్యాంకింగ్‌-2027లో ఓయూకు తొలిసారిగా స్థానం లభించలేదు. అంటే 1500 ర్యాంకుల పరిధిలో కూడా ఈ వర్సిటీ చోటు దక్కించుకోలేకపోయింది.

సెప్టెంబరులో విడుదలైన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రపంచ ర్యాంకింగ్‌లోనూ ఓయూ వెనుకబడింది.

గతంలో 1201-1500 మధ్య ఉన్న ఈ విశ్వవిద్యాలయం.. తాజా జాబితాలో 1601-1800 ర్యాంకుల పరిధికి పడిపోయింది.

టైమ్స్‌ ర్యాంకింగ్‌లో గత పదేళ్లలో ఓయూ ర్యాంకు సగానికి సగం తగ్గడం గమనార్హం.

తాజా క్యూఎస్‌ ఆసియా ర్యాంకింగ్‌లోనూ ఓయూ స్థానం భారీగా పడిపోవడంతో విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడుతుండటంపై వారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT